ETV Bharat / state

తిరుపతిలో గంజాయి రవాణా చేస్తున్న 20 మంది అరెస్ట్.. మరోచోట ముగ్గురు - selling ganja

Police Seized the Ganja: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ, విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి కేంద్రంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తున్న 20 మందిని అరెస్టు చేసి.. 20 కిలోల గంజాయి, 13వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలమనేరులో.. గంజాయిని విక్రయిస్తున్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Police Seized the Ganja
గంజాయి
author img

By

Published : Apr 4, 2023, 7:13 PM IST

Police Seized the Ganja: రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాలలో గంజాయి రవాణా చేస్తున్న వారిని, అదే విధంగా గంజాయిని అమ్ముతున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇరవై మందిని తిరుపతిలో పట్టుకోవడం గమనార్హం. ఇక పలమనేరులో ఏ వ్యక్తి ఇద్దరికి గంజాయిని అమ్మగా.. ఆ ముగ్గురునీ పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతిలో 20 మంది అరెస్ట్: తిరుపతి కేంద్రంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లాలో గంజాయి రవాణా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, నిందితుల వివరాలను ఎస్పీ పరమేశ్వర రెడ్డి వివరించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలానికి చెందిన నాగేంద్ర.. తిరుపతిలో ఎనిమిది సంవత్సరాలుగా నివసిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దళాలు.. నాగేంద్ర ముఠాను అరెస్ట్ చేశారన్నారు.

నాగేంద్రతో పాటు మరో 20 మందిని అదుపులోకి తీసుకుని 22 కిలోల గంజాయి, 13 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నాగేంద్ర ముఠాలో తిరుపతికి చెందిన వారితో పాటు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారన్నారు. నాగేంద్రపై గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

పలమనేరులో మరో ముగ్గురు: గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ముద్దాయిల వద్ద ఉన్న సుమారు పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు, గంగవరం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి చాకచక్యంగా ముద్దాయిలను పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడంతో అప్రమత్తమైన పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఒక మోటార్ సైకిల్​పై ఉన్న వ్యక్తి, ఆటోలో ఉన్న వ్యక్తికి గంజాయి ప్యాకెట్​ను ఇస్తూ ఉండగా, వారిద్దరినీ పట్టుకొని విచారించారు.

షేక్ సలీమ్ అనే అతను గతంలో సారాయి, గంజాయి వ్యాపారం చేస్తూ ఉండేవాడని.. అప్పుడు పోలీసులకు దొరికి కేసులు నమోదైనందున కొన్ని రోజులు ఆ వ్యాపారం చేయడం మానేశాడని పోలీసులు తెలిపారు. కానీ సుమారు సంవత్సరం నుంచి తిరిగి గంజాయి వ్యాపారం ప్రారంభించినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో గంజాయిని కొని.. వాటిని ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నాడని పోలీసులు గుర్తించారు.

తాజాగా రెండు వారాల క్రితం సుమారు 10 కేజీల గంజాయిని కొన్నట్లు తెలిపారు. అందులో రెండు కేజీల ప్యాకెట్​ను మరో వ్యక్తికి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. అంతకు మందు మరో రెండు కేజీల ప్యాకెట్​ను వేరే వ్యక్తికి అమ్మగా.. అతనిని కూడా పట్టుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.