చిత్తూరు జిల్లాలోని చిన్నగొట్టిగల్లు మండలంలో పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మండలంలోని భాకరాపేట బీసీ కాలనీలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లోని వ్యక్తుల ఆధార్ కార్డులు, వాహన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అదే సమయంలో అనుమానితుల వివరాలను సేకరించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: