పూజల పేరుతో ప్రజలను మోసగించి వారి వద్ద నుంచి డబ్బు నగదు కాజేస్తున్న ఆరుగురిని చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఆరుగురు నిందితులు.. పూజల పేరుతో మదనపల్లిలో ప్రజలను మోసం చేస్తున్నారని డీఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు.
వీరి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురుపై కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కన్నారు.
ఇదీ చదవండి: