చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులను తిరుపతికి తరలించాలని పోలీసులు యోచిస్తున్నారు. మదనపల్లె సబ్ జైలులో బుధవారం నిందితులను పరీక్షించిన వైద్యులు... వారిని రుయా ఆసుపత్రికి తరలించాలని సిఫారసు చేశారు.
మరోవైపు నిందితులు పద్మజ, పురుషోత్తం మంగళవారం ఆహారం ముట్టలేదని... ఇవాళ ఉదయం అల్పాహారం తీసుకున్నారని సబ్ జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ యాదవ్ తెలిపారు. ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తరలింపు కోరుతూ న్యాయమూర్తి అనుమతి కోరామన్నారు.
ఇదీ చదవండి:
'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !