చిత్తూరుజిల్లా రామచంద్రాపురం మండలం మిట్టూరు ఎస్టీ కాలనీకి చెందిన గణేష్ 20 సంవత్సరాలుగా గొర్రెలు మేపి జీవనం సాగిస్తున్నాడు.ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం గొర్రెలను మేపేందుకు తీసుకెళ్లి వాటిని దొడ్డిలోనే వదిలి వెళ్ళాడు.సాయంత్రం వచ్చి చూడగా 12 పిల్లల చనిపోయి ఉండడాన్ని గుర్తించాడు.. గుర్తుతెలియని వ్యక్తులు విషప్రయోగంతో చంపేశారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. చనిపోయిన గొర్రెపిల్లలు 40వేలు చేస్తాయని....ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.
ఇవీ చదవండి: అప్పు తీర్చమన్న భర్తను చంపేశారు... కేసు పెట్టిన భార్యను కొట్టించారు...!