కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ... నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రజలు భారీగా వస్తున్నారు. పీలేరు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో అధికారులు నిత్యావసర సరకుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లకు పెద్ద ఎత్తున జనం వస్తున్నందున రద్దీ నెలకొంది. కలికిరి కొనుగోలు కేంద్రంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించకుండా దగ్గరదగ్గర నిలబడ్డారు. ఇలాంటి చర్యల వల్ల కరోనా వేగంగా వ్యాపిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి.