ETV Bharat / state

ఆధార్ మార్పులు చేర్పుల కోసం తప్పని తిప్పలు...

ఆధార్ కార్డు చేయించాలన్నా..మార్చాలన్నా ప్రజలకు మాత్రం తిప్పలు తప్పటం లేదు.. రోజులు తరబడి ఎదురు చూపులు, పడిగాపులు పడాల్సి వస్తోందని జనం వాపోతున్నారు.

author img

By

Published : Aug 26, 2019, 3:22 PM IST

ఆధార్ మార్పులు చేర్పుల కోసం తప్పని తిప్పలు
ఆధార్ మార్పులు చేర్పుల కోసం తప్పని తిప్పలు

ఆధార్​లో మార్పులు చేర్పులు కోసం ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. వందల మంది గ్రామీణ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బారులుతీరుతున్నారు. అయితే వీరి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు మాత్రం మిన్నకుండి పోతున్నారు. వందల మంది ప్రజలు కార్యాలయాలకు వస్తే 20లేదా 30 మందికి మాత్రమే ఆధార్​ మార్పులు చేస్తున్నారు. కొంతమంది పది రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనికావటం లేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట వందల మంది ప్రజలు బారులు తీరగా.. 20 నుంచి 50 మందికి మాత్రమే పని జరుగుతుంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వమే చేయాలని కోరుతున్నారు.

ఇదీచూడండి:కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ

Intro:AP_cdp_46_26_poorva vidyarthula_cheyuta_bagupadina patasala_Pkg_Ap10043
k.veerachari, 9948047582
ఒకప్పుడు ప్రాథమికోన్నత పాఠశాల గా ఉన్న ఆ పాఠశాల ఇప్పుడు ప్రాథమిక పాఠశాల గా మారింది విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, మౌలిక వసతులు లేకపోవడం వంటి కారణాలతో పాఠశాల గదులు నిరుపయోగంగా మారాయి. ఫలితంగా తలుపులు, కిటికీలు దెబ్బతిని భవనాలు దయనీయంగా మారాయి. విశాలమైన పాఠశాల ఆవరనాణానికి ప్రహరీ లేకపోవడంతో బయట వ్యక్తుల ఇష్టా రాజ్యానికి హద్దూ అదుపూ లేకుండా పోయింది. ఫలితంగా ప్రాంగణమంతా మందు సీసాలు, వ్యర్ధ పదార్థాలతో దారుణంగా మారింది. తాగునీటి వసతి లేదు. మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఇది కడప జిల్లా రాజంపేట మండలం వరదయ్య గారి పల్లె ప్రాథమిక పాఠశాల దుస్థితి. . * ఈ దుస్థితిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ స్థానిక పూర్వ విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లారు. వారు స్వయంగా పాఠశాలను పరిశీలించారు. అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. దయనీయంగా ఉన్న పాఠశాలను బాగు చేసుకోవాలని, అన్ని పాఠశాలల కంటే మేం చదువుకున్న పాఠశాల ఆదర్శంగా నిలవాలని భావించారు. అనుకున్నదే తడవుగా జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లిన వీరు అక్కడి స్నేహితులతో కలిసి సుమారు ఐదు లక్షల రూపాయల వరకు చందాల రూపంలో సేకరించారు.
* కువైట్లో సేకరించిన డబ్బుతో స్వగ్రామానికి చేరిన నరసింహులు, పెద్దయ్యనాయుడులు దగ్గరుండి పాఠశాలను బాగా చేయించారు. దెబ్బతిన్న తలుపులు, కిటికీలకు మరామతులు చేయించారు. గదులకు రంగులు వేయించారు. మరుగుదొడ్లను బాగు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించారు. పాఠశాలకు విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన పాఠశాల ప్రాంగణానికి కంచె ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రానికి కూడా రంగులు వేసి మరుగుదొడ్డిని బాగు చేయించారు. ఇలా పాఠశాలకు వచ్చిన అన్ని హంగులను కల్పించే తాము చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకున్నారు.

Body:పూర్వ విద్యార్థుల చేయూత బాగుపడిన పాఠశాల

Conclusion:కడప జిల్లా రాజంపేట మండలం వరదయ్యగారి పల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.