రాష్ట్రమంతటా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. వృద్ధులకు వికాలాంగులకు పింఛన్ల పంపిణీ జోరుగా జరిగింది. కృష్ణా జిల్లా మైలవరంలో పింఛన్ పంపిణీకి.. ఎన్నికల అధికారి ఎస్ కే సలాం హాజరయ్యారు. గుడివాడలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేతుల మీదుగా పింఛన్లు అందించారు.
గుంటూరు లోని అంజుమాన్ పాఠశాలలో వైఎస్సార్ జయంతికి.. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, కమిషనర్ శ్రీకేష్ , తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా వృద్ధులకు పింఛన్ అందించారు. వినుకొండ మున్సిపల్ ఆవరణలో లో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదగా అవ్వ తాతలకు పింఛన్లు పంపిణీ చేశారు.
కర్నూలులో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి పాణ్యం శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ హాజరయ్యారు. బనగానపల్లె గ్రామపంచాయతీ ఆవరణంలో లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని 33వార్డుల్లో పింఛన్ పంపిణీ చేశారు. గిద్దలూరులో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు.
తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యుడు ఆర్థర్ జ్యోతి వృద్ధులకు పింఛను అందించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు, రణస్థలం, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాలకు సంబంధించి నియోజకవర్గస్థాయి వైయస్సార్ రైతు దినోత్సవాన్ని రణస్థలం మండలంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసన సభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేతుల మీదుగా రైతు దినోత్సవాన్ని పింఛన్ పంపిణీకార్యక్రమం జరిగింది.శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పింఛన్ అందజేశారు.
ఇదీ చూడండి నిమ్మ రైతుల సమస్య పరిష్కారానికి కృషిచేస్తా: మోపిదేవి