చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు ఉద్యానవనాలను బాగు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో పర్యాటకులకు అందుబాటులోకి రానుందని తెలిపారు. పల్లె పల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పెద్దేరు ప్రాజెక్టును సందర్శించారు.
అధ్వాన్న స్థితిలో ఉన్న ఉద్యానవనాలను గమనించిన ఎమ్మెల్యే.. వాటిని పునరుద్ధరించే చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పందించిన అధికార యంత్రాంగం.. యుద్ధప్రాతిపదికన ఉద్యాననాలను బాగు చేసే పనిలో పడింది. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంది.
ఇవీ చూడండి: