అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసిన పెద్దిరెడ్డి.. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం తొలి ఏడాది సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారని గుర్తుచేశారు.
పేదరికమే ప్రామాణికంగా రాష్ట్రంలో కొత్త పింఛన్లు అందించనున్నామని తెలిపారు. గతంలో మాదిరిగా ఎవరికి ఫించన్లు రావాలో జన్మభూమి కమిటీలు నిర్ణయించే పరిస్థితులు లేవన్నారు. ఓడిపోతామని తెలిసి రాజ్యసభ ఎన్నికల్లో వర్లరామయ్యను నిలబెట్టటం చంద్రబాబు కుటిల రాజకీయానికి నిదర్శనమని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.