ETV Bharat / state

'జనసేన అంటే ఎందుకంత భయం?' - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

రైతుల పరామర్శకు వచ్చా.. ఆపగలిగితే ఆపండి. అడ్డుగోడలు కడితే బద్దలు కొడతామని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శించేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

జనసేన అంటే ఎందుకంత భయం?
జనసేన అంటే ఎందుకంత భయం?
author img

By

Published : Dec 5, 2020, 6:41 AM IST

Updated : Dec 5, 2020, 7:17 AM IST

తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చా. అధికారాన్ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఆపగలిగితే ఆపండి. 151 మంది ఎమ్మెల్యేలున్న వైకాపాకు జనసేన అంటే ఎందుకంత భయం? ఈ ప్రాంతం ఏమైనా మీ జాగీరా? ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంపై వైకాపాకు ఎంత హక్కుందో.. మాకూ అంతే ఉంది. అధికారం ఉంది కదా అని పోలీసుల సాయంతో అడ్డుగోడలు కడదామని చూస్తే బద్దలు కొట్టి ముందుకెళతాం’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆయన పరామర్శించారు. వర్షంలో తడుస్తూనే శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు, మనుబోలు మీదుగా నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరులో రాత్రి బస చేశారు. పలుచోట్ల రైతులు తడిసిన ధాన్యాన్ని పవన్‌కు చూపించి గోడు వెళ్లబోసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శిద్దామని వస్తే ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘ఎవరికీ భయపడను. మేము వైకాపా నాయకులను రెచ్చగొట్టడం లేదు. మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఏం చేయాలో మాకు తెలుసు. రోడ్లపైకి రావడానికి వెనకాడబోం’ అని పేర్కొన్నారు. ‘వైకాపా నాయకులు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. అధికారం శివుడి మెడలో పాములాంటిది. మెడలో ఉన్నంతవరకే దానికి విలువ. రోడ్డుపైకి వస్తే దాని పరిస్థితేంటో అందరికీ తెలుసు’ అని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం మాట విని మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే దృష్టిలో పెట్టుకుంటా. అధికార వర్గానికి మద్దతు పలికే వారిని మర్చిపోను’ అని అన్నారు.

పోయ్య గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత
రైతులకు అండగా నిలిచేందుకు వస్తుంటే కొందరు గ్రామంలోకి రావద్దని అడ్డుకుంటున్నారని పవన్‌కల్యాణ్‌ అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పోయ్య గ్రామంలో ఆయన పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దిల్లీలో రైతులు ఉద్యమిస్తున్నా పట్టించుకోకుండా ఇక్కడ ఎవరు పిలిచారని వస్తున్నారంటూ వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జనసైనికులు, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పవన్‌ వచ్చే సమయంలో భారీ వర్షం పడటంతో ఆయన వ్యాన్‌పైకి ఎక్కి ప్రసంగించి వెళ్లిపోయారు.

భాజపా విజయం తెలంగాణలో మార్పునకు సంకేతం: పవన్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా దృఢసంకల్పంతో పోరాడి ప్రజల మనసులను గెలుచుకుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆ పార్టీ అధినాయకత్వానికి, తెలంగాణ అధ్యక్షునిగా మరో విజయాన్ని అందుకున్న బండి సంజయ్‌కి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు లక్ష్మణ్‌కి, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ‘భాజపా సాధించిన 48 స్థానాలు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేదానికి బలమైన సంకేతం. భవిష్యత్తులోనూ ఆ పార్టీతో కలిసి తెలంగాణలో కూడా పనిచేస్తాం’ అని తెలిపారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన నుంచి 40-50 మంది సిద్ధంగా ఉన్నా.. తన మాటతో ఆగిపోయారని చెప్పారు. నెల్లూరులో శుక్రవారం రాత్రి పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్‌ మాట్లాడారు. జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే.. తాను బతికున్నంత వరకు జగన్‌ సీఎంగా ఉంటారని అంటున్నారని, జనసైనికుల కష్టాన్ని గుర్తించి ఆ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం లేదని చెప్పారు. ఆయన అలా మాట్లాడటానికి పరిస్థితులేమిటో తెలియదని పేర్కొన్నారు.

Last Updated : Dec 5, 2020, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.