చిత్తూరు జిల్లాలో పశువుల పండగ సంక్రాంతికి ప్రత్యేకమైనది. కందులవారిపల్లె యువకులు మందుగానే ఈ వేడుకను నిర్వహించారు. పశువుల కొమ్ములను అందంగా అలంకరించి చెక్కపలకలు, టవళ్లు కట్టి యువకుల మధ్యకు వదులుతారు. ఆ చెక్క పలకలను పట్టుకునేందుకు యువకులు పోటీపడతారు. పరువుకు...గర్వానికి మధ్య పశువులు పండగ నిలుస్తోంది. అయితే కందులవారిపల్లెలో జరిగిన ఈ పోటీల్లో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ పండుగను నిర్వహించ వద్దని పోలీసులు హెచ్చరించారు. అయినా గ్రామస్థులు పోలీసులకు తెలియకుండా ఈ వేడుకను జరిపారు.
ఇదీ చూడండి