ఎన్నికల నాటికి జనసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలను సిద్ధం చేస్తున్నట్లు.. పార్టీ రాయలసీమ, దక్షిణ కోస్తా పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ వెల్లడించారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో జరిగిన పార్టీ మేధోమథనం, పటిష్టత కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
హరి ప్రసాద్‌కు.. శంకరాపురం మండలం పుల్లూరు క్రాస్ వద్ద పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శ్రీరంగరాజపురం ఉన్నత పాఠశాల వరకు జరిగిన జనసేన కార్యకర్తల భారీ ర్యాలీలో నినాదాలు మిన్నంటాయి. మిషన్ 3,000 ప్రాముఖ్యతను వివరిస్తూ.. పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి కార్యకర్త పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: