ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యుల పర్యటన - పులిచెర్లలో పార్లమెంటరీ స్థాయి సంఘం

పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వారికి వైకాపా నాయకులు స్వాగతం పలికారు.

parlamentary committe
చిత్తూరు జిల్లాలో పర్యటించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు
author img

By

Published : Jan 16, 2021, 10:45 PM IST

గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారత కనిపిస్తోందని పార్లమెంటరీ స్థాయి సంఘం(గ్రామీణ అభివృద్ధి) ఛైర్మన్ ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో క్షేత్రస్థాయి పర్యటన చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు... అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నలుగురు ఎంపీలతో కూడిన కమిటీకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్వాగతం పలికి వివరాలు వెల్లడించారు.

కల్లూరులో స్వయం సహాయక మహిళా సంఘాలతో పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఉపాధి హామీ నిధులతో తవ్వించిన పంట కుంటలు, చెరువులను స్థాయీ సంఘం సభ్యులు పరిశీలించారు. సమావేశం అనంతరం పర్యటన వివరాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అమలవుతున్న తీరును స్థాయి సంఘం ప్రశంసించిందని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: ఈ రాజకీయాలు తట్టుకోలేకపోతున్నా: మంత్రి నారాయణస్వామి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.