ETV Bharat / state

సొంత ఆక్సిజన్​ ప్లాంట్​ ఏర్పాటుతో ఆదర్శంగా నిలిచిన ఆసుపత్రి

చిత్తూరు జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రి సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఆక్సిజన్​ ప్లాంట్​ను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​ రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రి ముందుచూపును కొనియాడారు. రోగులకు మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​ రెడ్డి
సొంత ఆక్సిజన్​ ప్లాంట్​ ఏర్పాటుతో ఆదర్శంగా నిలిచిన ఆసుపత్రి
author img

By

Published : May 1, 2021, 9:28 PM IST

కరోనా విజృంభణ వల్ల ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత రోజుల్లో.. సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఎంజీఎం ప్రైవేట్ వైద్యశాల ఆదర్శంగా నిలుస్తోంది. గంటకు 5 వేల లీటర్ల ఆక్సిజన్ తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేసుకుంది. ఇందుకోసం సుమారు రూ.30 లక్షలు వెచ్చించింది. దీనిని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​ రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రి ముందస్తు ప్రణాళికను ఆయన అభినందించారు.

oxygen plant established at mgm hospital
సొంత ఆక్సిజన్​ ప్లాంట్​ ఏర్పాటుతో ఆదర్శంగా నిలిచిన ఆసుపత్రి

ఇప్పటికే ఆసుపత్రిలోని 20 పడకలను కరోనా వార్డుగా కేటాయించడంతో అవసరానికి అనుగుణంగా అధిక సంఖ్యలో పడకల కేటాయించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్లాంట్​తో ప్రస్తుతం 40 బెడ్లకు అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తి సమకూరనున్నట్లు ఎంజీఎం సంస్థల డైరెక్టర్ మయూర్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. కొత్తగా శ్రీకాళహస్తిలో ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేయనున్నట్లు మయూర్ వివరించారు.

ఇవీ చదవండి:

తమిళ పోరు: కౌంటింగ్​కు వేళాయెరా

కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: చింతా మోహన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.