ETV Bharat / state

వైకాపా అరాచకాలపై భగ్గమన్న విపక్షాలు - ZPTC,MPTC elections news

స్థానిక ఎన్నికల్లో వైకాపాకు చెందిన నామినేషన్ల మినహా మిగిలిన పార్టీలకు చెందిన నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తున్నారని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విపక్ష నేతలు మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార వైకాపా అరాచకాలకు పాల్పడుతుందని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధ జైన్​కు ఫిర్యాదు చేశారు.

oppostion parties meeting on ycp attack on candidates who context in local body elections
వైకాపా అరాచకాలపై విపక్షాలు సమావేశం
author img

By

Published : Mar 14, 2020, 11:47 AM IST

వైకాపా అరాచకాలపై విపక్షాలు సమావేశం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నియోజకవర్గంలో బాయ్​కాట్ చేస్తున్నట్లు తెదేపా సమన్వయకర్త బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. రేణిగుంట మండలం ఎస్​ఐ బలరాం భార్య వైకాపా తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం దారుణమని భాజపా సమన్వయకర్త కోలా ఆనంద్ అన్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ సమన్వయకర్త బత్తయ్య నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార వైకాపా అరాచకాలకు పాల్పడుతుందని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థలో చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధ జైన్​ను కలిసిన భాజపా నేతలు వైకాపా నాయకులు సాగిస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తక్షణం ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి స్థానిక ఎన్నికల పరిస్థితిపై అమిత్‌ షాకు కన్నా లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.