ETV Bharat / state

ONLINE BETTING GANG ARREST: రెండింతలు ఆదాయమని మోసం.. ఆన్​లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు - online betting gang arrested in ap

ONLINE BETTING GANG ARREST: బెట్టింగ్ పెట్టిన వారికి రెండితలు ఆదాయం వస్తుందంటూ ఆశచూపి డబ్బు కాజేస్తున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు.

ONLINE BETTING GANG ARREST
ONLINE BETTING GANG ARREST
author img

By

Published : Jan 6, 2022, 10:42 PM IST

ONLINE BETTING GANG ARREST: ఆన్​లైన్​లో బెట్టింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు చిత్తూరు పోలీసులు. సామాజిక మాధ్యమాలే వేదికగా.. బెట్టింగ్​లో మోసాలు చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. పెట్టుబడి పెడితే రెండింతల ఆదాయం వస్తుందని నమ్మబలికి.. మోసాలకు పాల్పడినట్లు తెలిపారు.

చిత్తూరు నగరానికి చెందిన నితీష్ రెడ్డి అనే సాఫ్ట్​వేర్ ఇంజనీర్ ఆన్​లైన్ బెట్టింగ్​లో రూ. 26 లక్షల వరకు మోసపోయాడు. దీనిపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో.. వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులు నేరానికి ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాలను, వివిధ బ్యాంకు ఖాతాల్లోని మెుత్తం రూ. 1.27 కోట్ల సొమ్మును ఫ్రీజ్ చేశారు.

ఆధునిక సాంకేతికను వినియోగించి.. మోసగాళ్ల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ట్విట్టర్, ఫేస్​బుక్ తదితర సామాజిక మాధ్యమాలే వేదికగా యువతను ఆకర్షించారని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిరిగిడి ప్రవీణ్, విజయనగరం జిల్లాకు చెందిన దుంగ సంతోష్ కుమార్, పల్లి లోకేష్​లను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

MLA ROJA MET MINISTER: మంత్రి బొత్సను కలిసిన ఎమ్మెల్యే రోజా.. ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.