చిత్తూరు జిల్లా చంద్రగిరి జోగులకాలనీలో విషాదం జరిగింది. అప్పుల బాధతో గణేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గణేష్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కరోనా సమయంలో పనులు లేక.. అప్పులు చేశాడు. ఇప్పుడు అప్పుల వాళ్ల తాకిడి ఎక్కువ కావటంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ గణేష్ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: