ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్మించిన ఇళ్లను ఈ నెల 20 ఆక్రమించుకోవటం ఖాయమని... సీపీఐ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ హయాంలో రూ.58 కోట్లతో పుత్తూరు మున్సిపాలిటీలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 10009 గృహాలు నిర్మించినట్లు తెలిపారు. అందులో ఇప్పటికే 90శాతం పైగా పూర్తి చేశారని తెలిపారు. వాటిని అలాగే వదిలేయడం వల్ల రెండు మూడేళ్లకు మొత్తం పాడయ్యే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నిర్మించిన గృహ నిర్మాణాలను అలాగే వదిలేయడం మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో గృహ నిర్మాణాలు పరిశీలిస్తున్నామని...ప్రస్తుతం 7 లక్షల ఇళ్లు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని...వాటిలో ఈ నెల 20వ తేదీన లబ్ధిదారులతో వెళ్లి ఆక్రమించుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి: