చిత్తూరు జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలోని మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే డి.రమేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతిని జరిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి అభిషేకం చేసి నివాళులర్పించారు. కార్యకర్తలు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. నందమూరి ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు. ఎన్నారైల సహకారంతో పట్టణంలోని 90 మంది పేద బ్రాహ్మణులకు మాజీ ఎమ్మెల్యే రమేష్ నిత్యావసర సరుకులు అందజేశారు.
పుత్తూరులో స్థానిక తెదేపా నాయకులు ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద ప్రజల కోసం తెదేపా చేపట్టిన కార్యక్రమాల గురించి వారు వివరించారు.
ఇది చదవండి రెండో రోజు ఘనంగా ప్రారంభమైన పసుపు పండుగ