తెదేపా గెలుపును ఆకాంక్షిస్తూ మదనపల్లిలో ఎన్నారై ఎన్నికల ప్రచారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో తెదేపా ఎన్ఆర్ఐ కార్యకర్తలు.. ఎల్ఈడీ తెరలున్న7వాహనాలతో ప్రచారానికి సిద్ధమయ్యారు.పట్టణానికిచెందిన ప్రవాసాంధ్రుడు లోకేష్ ఆధ్వర్యంలో ఎల్ఈడీ వాహనాలతోఓటర్లను కలిసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా..ఎల్ఈడీబోర్డులతో ప్రచారం చేయనున్నారు. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబే..మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
ఇవి చదవండి
ఓటర్లకు వైకాపా తాయిలాలు.. పట్టుకున్న పోలీసులు