ETV Bharat / state

మిడతల బెడద మనకు లేనట్టే...! - మిడతల సమస్యల వార్తలు

రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎడారి మిడతల దండు తమ దిశను మార్చుకుని, మధ్యప్రదేశ్ వైపునకు మరలినట్లు చిత్తూరు జిల్లా కలికిరి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు వెల్లడించారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు.

locusts problems at chittor district
మిడతల బెడద మనకు లేనట్
author img

By

Published : Jun 2, 2020, 11:33 AM IST

ఒకవైపు కరోనా వచ్చి ప్రజలు సతమతమవుతుంటే... ఇప్పుడు మిడతల దండు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేయబోతోందని రైతులు అందోళన చెందుతున్నారు. ఈ మిడతల దండు తమ దిశ మార్చుకుని మధ్యప్రదేశ్​ వైపునకు మరలినట్లు, చిత్తూరు జిల్లా కలిగిరి కృషి విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

దక్షిణ భారతదేశానికి ఇప్పట్లో మిడతల దండు ప్రభావం ఉండబోదని వారు తెలిపారు. ఉత్తర భారతదేశంలో ఆరు రాష్ట్రాలోని పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నఈ మిడతల దండు... తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావించినప్పటికీ, అవి మహారాష్ట్ర నుంచి దిశ మార్చుకుని మధ్యప్రదేశ్ వైపునకు వెళ్లినట్లు తెలుస్తోందని తెలిపారు.

ఈ మిడతల దండు కేవలం జిల్లేడు చెట్ల ఆకులను మాత్రమే ఆశిస్తాయని, మిగతా పంటలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు. అయినా...వీటి నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా డెల్టామైత్రిన్ ఒక మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేస్తే అవి చనిపోతాయి వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

ఇవీ చూడండి

దడ పుట్టిస్తున్న మిడతల దండు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.