చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలం ఓబుల్ రెడ్డి గ్రామంలో విషాదం జరిగింది. సైకిల్ పై వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టిటంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. నాలుగోవ తరగతి చదువుతున్న విజయ్ కుమార్ తల్లి తండ్రులది హైదరాబాద్ కాగా.. కరోనా కారణంగా మదనపల్లి గ్రామీణ మండలం ఓబుల్ రెడ్డి గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ కృష్ణమ్మ ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో బాలుడు సైకిల్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొంది. గాయపడ్డ బాలుడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విజయ్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్రామీణ పోలీసులు బాలుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి కేసు నమోదు.. చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. ధూళిపాళ్ల నరేంద్రను విచారించిన అ.ని.శా. అధికారులు