చిత్తూరు జిల్లా పుత్తూరు అటవీ అధికారులు మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి- చెన్నై జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ వద్ద జరిపిన తనిఖీల్లో సుమారు తొమ్మిది లక్షలు విలువ చేసే దుంగలు పట్టుకున్నామని అటవీ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. నిందితులు పరారయ్యారని, వారికోసం గాలిస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి: