రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన తిరుపతి రుయా సంఘటనతో అప్రమత్తమైన చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు.. ఆక్సిజన్ వార్ రూం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో జేసీ (ఆరోగ్యం), ఆర్డీవో ఇతర ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.
ప్రభుత్వ, ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, అవసరాలు, వాడకం పర్యవేక్షణపై ప్రత్యేక అధికారులను నియమించాలనే నిర్ణయానికి వచ్చారు. రోగికి ఆక్సిజన్ అందలేదని ఫిర్యాదులు వస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ వీరబ్రహ్మం హెచ్చరించారు.
ఇవీ చదవండి: