Nara Lokesh 17th Day Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 17వ రోజు చేపట్టిన పాదయాత్ర కొత్తూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా అడుగడుగునా అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మహిళలు హరతులిచ్చి... టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టిటి కండ్రిగ గ్రామం సమీపంలో ఆటో డ్రైవర్ శివకుమార్ ని లోకేశ్ పలకరించారు. డీజిల్ రేటు ఎంత అని లోకేష్ అడగగా 95 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. మాది సరిహద్దు గ్రామం ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ రేటు ఎక్కువగా ఉంది అందుకే రోజు పక్కనే ఉన్న తమిళనాడు బోర్డర్ కి వెళ్లి డీజిల్ కొట్టిస్తా అంటూ లోకేశ్‌కు సమాధానం చెప్పాడు. టీడీపీ అధికారంలోకి రాగానే డీజిల్, పెట్రోల్ పన్నులు తగ్గించి ధరలు తగ్గిస్తామన్నారు. అప్పుడు బోర్డర్ దాటి పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం ఉండదని భరోసా ఇచ్చారు.
పాదయాత్రలో భాగంగా ఈడిగపల్లి గౌడ, ఆలత్తూరు మైనారిటీలను లోకేశ్ కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రతి ఒక్కరికి గుర్తింపు కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. గీత కార్మికుల పట్ల టీడీపీ చిత్తశుద్ధితో ఉందని... కల్లుగీత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై కక్షగట్టి హత్యలు చేయిస్తున్నాడని లోకేశ్ విమర్శించారు. 2019ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడని దుయ్యబట్టారు. మైనారిటీలపై అక్రమ కేసులు బనాయించే వైసీపీ సైకో పాలనను 2024లో గద్దె దించాలని లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: