ETV Bharat / state

తాలిబన్ పాలన గుర్తుకుతెస్తున్న జగన్​ పాలన - దళితులపై హింసను నిలువరించాలి : లోకేశ్ - Lokesh Comments

Nara Lokesh Fire on Police: టీడీపీకి చెందిన దళిత నేత వెంకటరమణపై కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు దాడి చేసి హింసించిన ఘటనపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ.. పోలీసులు వైఎస్సార్సీపీ ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని మండిపడ్డారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.

Nara_Lokesh_Fire_on_Police
Nara_Lokesh_Fire_on_Police
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 1:04 PM IST

Nara Lokesh Fire on Police : రాష్ట్రంలో పోలీసులు వైఎస్సార్సీపీ ప్రైవేటు సైన్యంలా మారిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను దారుణంగా వేధిస్తూ.. తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆటవిక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎటువంటి కేసులేని తెలుగుదేశం పార్టీ దళిత నేత, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకట రమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు వెనక్కి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేయడం తాలిబాన్ రాజ్యాన్ని గుర్తుకు తెస్తున్నారని నిప్పులు చెరిగారు.

నోట్లో గుడ్డలు కుక్కి, బూటు కాళ్లతో తన్ని - పుంగనూరులో సీఐ దాష్టీకం

TDP Leader Mullangi Venkataramana Incident : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) బహిరంగ వేదికలపై నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీలు అంటూ లేని ప్రేమలు ఒలకబోస్తుంటే.. వాస్తవంలో ఆయావర్గాలపై ఇది వరకు ఎప్పుడు లేని విధంగా అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం దళిత నేతను అక్రమంగా నిర్బంధించి.. దాడి చేసిన కల్లూరు సీఐపై రాష్ట్ర డీజీపీ తక్షణమే విచారణ జరిపించాలని.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న రాజ్యహింసను నిలువరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నారా లోకేశ్ కోరారు.

పుంగనూరులో ప్రజాస్వామ్యం లేదు : దాడికి పాల్పడిన సీఐ కత్తి శ్రీనివాసులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రిషాంత్‌రెడ్డి (SP Rishant Reddy)కి చల్లా రామచంద్రారెడ్డి శనివారం చిత్తూరులో వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదని దుయ్యబడ్డారు. పుంగనూరు అల్లర్ల ఘటన (Punganur Incident) జరిగి 90 రోజులు అయినా ఇంకా అరెస్టులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం: లోకేశ్

అసలేం జరిగింది : టీడీపీకి చెందిన దళిత నేత వెంకటరమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు దాడి చేసి హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగస్టు 4న పర్యటనలో భాగంగా పుంగనూరు, అంగళ్లులో జరిగిన ఘటనల కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‍ ఉన్నా.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం పుంగనూరు కోర్టులో హాజరు పరచగా ముందస్తు బెయిల్‍ (Anticipatory Bail) ఉండటంతో న్యాయాధికారి వెంకటరమణ రిమాండ్​ను తిరస్కరించారు. ఈ క్రమంలో సీఐ శ్రీనివాసులు దుర్భాషలాడుతూ నోట్లో గుడ్డలు కుక్కి ఇష్టారీతిన బూటు కాళ్లతో తన్నారని, అరికాళ్లు, చేతులు తొక్కిపట్టి చిత్రహింసలు పెట్టారని, రౌడీషీట్ తెరుస్తామని బెదిరించారని బాధితుడు వెంకటరమణ వాపోయారు.

పుంగనూరు పోలీసులు వెంకటరమణను రిమాండ్‌ (Remand) నిమిత్తం స్థానిక కోర్టులో హాజరు పరిచారు. హైకోర్టు తీర్పు కాపీని న్యాయవాది బి.వెంకట ముని యాదవ్‌.. న్యాయమూర్తికి చూపారు. పోలీసులు కక్షపూరితంగా అరెస్టు చేశారని పేర్కొనగా రిమాండ్‌ను తిరస్కరించారు. తనను సీఐ కొట్టారని ఈ సందర్భంగా న్యాయమూర్తికి వెంకటరమణ తెలిపారు.

Nara Lokesh Condemned Attack on RTC Bus Driver in Kavali: వైసీపీ నేత‌లు గూండాల కంటే ఘోరంగా దాడిచేశారు.. హారన్‌ కొట్టడమే ఆర్టీసీ డ్రైవర్‌ నేరమా: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.