చిత్తూరు జిల్లా పుత్తూరు మార్కెట్ యార్డ్లో నగరి ఎమ్మెల్యే రోజా సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పంట కొనుగోళ్లకు సంబంధించి ధరల స్థిరీకరణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రూ.3 వేల కోట్లు కేటాయించారని రోజా పేర్కొన్నారు.
కట్టుబడి ఉన్నారు..
ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండిస్తున్న పంటలను కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. బహిరంగ మార్కెట్లో దళారులు రూ.2,150 చెల్లిస్తున్నారని.. ప్రభుత్వం అంతకంటే ఎక్కువే అందిస్తోందని వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని రోజా పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి గోపి, వైకాపా నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కొడాలి వ్యాఖ్యలు నిరసిస్తూ భాజపా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు