రోజుకు 500కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైకాపా వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో భాజపాకు మద్దతు తెలుపుతూ.. ప్రచారం నిర్వహించేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు..పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన నాదెండ్ల...రత్నప్రభ అభ్యర్థిత్వంపై జనసేన పూర్తిస్థాయి సంతృప్తితో ఉందన్నారు. వచ్చే వారంలో పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారన్న మనోహర్..భాజపా-జనసేన కూటమి అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.