చిత్తూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 886 ఎంపీటీసీ స్థానాలు, 65 జడ్పీ స్థానాలు ఉన్నాయి. నామినేషన్ల సమయంలో పోటీ లేకపోవడంతో 433 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన 419 స్థానాల్లో 389 ఎంపీటీసీలను అధికార వైకాపా కైవసం చేసుకుంది. ప్రతిపక్ష తెదేపా అభ్యర్థులు 25 స్థానాల్లో విజయం సాధించారు. స్వతంత్రులు మరో స్థానాలు దక్కించుకున్నారు.
మరోవైపు 65 జడ్పీ స్థానాలకు గాను 30 ఏకగ్రీవమయ్యాయి. కలకడ, బంగారుపాళ్యం జడ్పీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు మృతి చెందడంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. మరో 33 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అన్నింటిలోనూ అధికార వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.
ఇదీచదవండి.