మదనపల్లె జంట హత్యల కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునర్జన్మలపై విశ్వాసమే హత్యలకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో గుర్తించిన వివరాల ప్రకారం... ఈ నెల 22న తన పేరును 'మోహిని'గా మార్చుకుంటూ సోషల్ మీడియాలో అలేఖ్య పోస్టులు పెట్టింది.
తాను ప్రపంచ సన్యాసిని అని పేర్కొంది. తరచూ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త 'ఓషో' కొటేషన్లు పెర్కొంటూ వస్తోంది. 'ఓషో'ను తన ప్రేమికుడిగా పోస్టులు చేసింది. చావు, పుట్టుకలకు సంబంధించి తరచూ కొటేషన్లను పోస్టు చేసేది అలేఖ్య. జుట్టును కొప్పుగా చుట్టుకుని 'హెయిర్ పిరమిడ్'గా పేర్కొనేది. హెయిర్ పిరమిడ్‌ను అయస్కాంత శక్తిగా అభివర్ణించింది.
ఇదీ చదవండి:
జంట హత్యల కేసులో పోలీసుల సమన్వయ లోపం... నిందితుల తరలింపు ఆలస్యం