ETV Bharat / state

విచిత్ర బంధం..శునకాలతో వానరం స్నేహం

author img

By

Published : Jul 7, 2020, 1:21 PM IST

ఆ శునకాలు నిజంగానే విశ్వాసాన్ని చాటుకున్నాయి. తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగాన్ని తల్లి లేని వానరానికి పెడుతూ కాపాడుతున్నాయి. తన చిలిపి చేష్టలతో గెంతుతూ...శునకాలపై కూర్చుని వానరం సవారి చేస్తోంది. ఈ విచిత్ర స్నేహం చిత్తూరు జిల్లా తిరుపతిలో కొనసాగుతోంది.

monkey dog friendship in tirupathi
ఆశ్చర్యపరుస్తున్న వానరం శునకం సావాసం
ఆశ్చర్యపరుస్తున్న వానరం శునకం సావాసం

తిరుపతిలో ఓ వానరం... శునకాలతో సావాసం చేయటం అందరిని ఆకట్టుకుంటోంది. చిన్నతనంలోనే తల్లి కోతి వదిలేయటంతో ఈ వానరం ఒంటరయ్యింది. ఆ వీధిలో ఉండే శునకాలే దాని ఆలనా పాలనా చూస్తున్నాయి. ఆ కోతి శునకాలపైకి ఎక్కి వాటితో సరదాగా ఆడుకుంటూ చూపరులను ఆకర్షిస్తోంది. తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగాన్ని వానరానికి పెడుతూ ఆ శునకాలే కాపాడుకుంటున్నాయి. జన్మతః విరోధులుగా ఉండే శునకాలు-వానరం స్నేహ బంధం కొనసాగిస్తుండటంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ మూగజీవాలకు ఆహారాన్ని అందిస్తూ స్థానికులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

ఇదీ చదవండి:

'అన్యమత ప్రచారం' వార్తలపై తితిదే స్పందన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.