చిత్తూరు జిల్లాలో మారుమూల నియోజకవర్గాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, వాల్మీకిపురం ప్రాంతాల్లో.. సన్న చిన్నకారు రైతు పిల్లలు, కూలీల బిడ్డలు చదువుకోవాలంటే ఒకప్పుడు గగనమయ్యేది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించుకునే ఆర్థిక స్తోమత లేని చాలామంది వారి పిల్లలను.. తమ వృత్తుల్లోనే కొనసాగించేవారు.
పాఠశాల వైపు నడిపిస్తోన్న ప్రభుత్వాలు...
ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా అమలుచేస్తున్న నూతన విద్యా విధాన కార్యక్రమాలు, ఆదరణ పథకాలు, ఆర్థిక సహకారం వంటి పథకాలతో నిరుపేద గ్రామీణ విద్యార్థులు పాఠశాలల వైపు నడుస్తున్నారు. మూతపడిన పాఠశాలలు సైతం మళ్లీ తెరుచుకునేలా ఈ చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం.. విద్యార్థులకు ఉచితంగా దుస్తులు.. అమ్మ ఒడి ఆర్థిక సహాయం.. అధునాతన విద్యా కార్యక్రమం ఆనందలహరి.. ఇతర నూతన విద్యా కార్యక్రమాలతో గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు కొత్త ఒరవడితో నడుస్తున్నాయి.
విద్యార్థులతో నిండుగా...
తంబళ్లపల్లి మండలం కన్నె మడుగు గ్రామం రెడ్డివారిపల్లి ప్రాథమిక పాఠశాల, కుక్కరాజుపల్లె గ్రామం కుమ్మర పల్లె పాఠశాల, తంబళ్లపల్లె గ్రామం శ్రీనివాస్ కాలనీ, పంచాలిమరి గ్రామం ప్రాథమిక పాఠశాల పాఠశాలలు ఒకప్పుడు విద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉండేవి. ప్రభుత్వ విధానాలతో ఈ పాఠశాల గదులు ఇప్పుడు చిన్నారులతో కళకళలాడుతున్నాయి. ఎనిమిది సంవత్సరాల క్రితం పది మంది విద్యార్థులతో మూతపడే స్థితిలో ఉన్న రెడ్డివారిపల్లె ప్రాథమిక పాఠశాలలో నేడు 36 మంది విద్యార్థులున్నారు. ఆనందలహరి కార్యక్రమాలతో, ఆటపాటలతో, విద్యాబోధన ఆదర్శవంతంగా కొనసాగుతోంది.
ఇవీ చూడండి: