చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది తీరంలో అత్యాధునిక పద్ధతులో శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నారు. రూ.27 కోట్లతో నిర్మించనున్న ముక్తిధామానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. దీంతో కాశీలాగా శ్రీకాళహస్తి కూడా ముక్తిధామంగా ప్రసిద్ధి చెందుతుందని ఆయన అన్నారు. వేగంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభించిన తితిదే