ETV Bharat / state

'అభివృద్ధి పనులు చేపట్టాం.. నీటి సమస్యలు తీరుస్తాం' - నగరిలో చెరువుల అభివృద్ధి పనుల వార్తలు

చిత్తూరు జిల్లా నగరిలో చెరువుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోజా భూమిపూజ చేశారు. వీటి అభివృద్ధితో నియోజకవర్గంలో తాగు, సాగు నీటి సమస్యలు తీరతాయని చెప్పారు.

mla roja foundation to ponds developement works in nagari
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోజా
author img

By

Published : Jun 15, 2020, 9:22 PM IST

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో త్వరలో తాగు,సాగునీటి సమస్య తీరబోతోందని.. ఎమ్మెల్యే రోజా అన్నారు. 8 చెరువుల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జేఐసీఏ(జపాన్ ఇంటిగ్రేటెడ్ కార్పొరేషన్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయని తెలిపారు. చెరువుల్లో పూడికలు తీయడం, కబ్జాకు గురైన వాటిని గుర్తించి వాటిని అభివృద్ధి చేయడం వంటి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

కుశ స్థలి నది నుంచి నీటిని చెరువులకు పంపే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి ద్వారా 47వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

'వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.