తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి కరోనా నియంత్రణలో భాగంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రత్యేకంగా 5 సేవలను ఏర్పాటు చేశారు. రావులపాలెంలోని వైకాపా కార్యలయంలో 24 గంటలు అందుబాటులో కాల్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గంలోని ప్రజల కోసం కరోనా పరీక్షలు చేసే కిట్లను, పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు మందులు పంపిణీ, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా కరెంట్ ఆక్సిజన్ యంత్రాలను, 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా అంబులెన్స్ను, 4 మండలాల్లోని శానిటైజర్ చేసే యంత్రాలను ఆయన ప్రారంభించారు.
ఉచితంగా ప్రజలకు పరీక్షలు చేసేందుకు మూడు వేల కరోనా కిట్లను కొనుగోలు చేశామన్నారు. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులను అందిస్తామన్నారు. తన తండ్రి చిర్ల సోమసుందర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 24 గంటలు కరోనా రోగులను హాస్పిటల్ కు తీసుకు వెళ్లటానికి ఉచిత అంబులెన్స్ సర్వీస్,నియోజకవర్గం అంతా హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయటం జరుగుతుందన్నారు కరోనా కట్టడికి ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని.. అవసరం అయితే తప్ప బయట తిరగద్దని, మస్కులు, సేనిటైజర్లు వాడుతూ భౌతిక దూరం పాటించి కరోనా నియంత్రణ కోసం సహకరించాలని కోరారు.
ఇదీ చదవండీ.. శభాష్ నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్‌కు నీ సాయం గొప్పది తల్లీ!