చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలను గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రగిరిలో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయటానికి చర్యలు చేపట్టామన్నారు.
చంద్రగిరిలోని ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆక్సిజన్ బెడ్లు, నారావారిపల్లెలోని ఆసుపత్రిలో మరో 50 పడకలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. వీటి ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాల గురించి చర్చించారు.
ఇదీ చదవండి: