చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని తలకోనలో అన్నదాన సత్ర భవనం ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా నిర్మించనున్న ఈ భవనానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు భూమిపూజ నిర్వహించారు. మాజీ జడ్పీ చైర్మన్ సీతారామరాజు జ్ఞాపకార్ధం వారి కుమారులు 60 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు.. ఎమ్మెల్యే చెవిరెడ్డి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రేవతి రెడ్డప్ప రెడ్డి, ఈవో జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...