చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం పార్లపల్లికి చెందిన కుమారస్వామి, జయంతిల కుమారుడు అభిరామ్(7) మంగళవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
సీఐ ఆరోహణరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం.. బుచ్చినాయుడు, కండ్రిగ, శ్రీకాళహస్తి మధ్య గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి మండలం రామాపురం రిజర్వాయర్ వద్ద కొందరు వ్యక్తులతో కలిసి అభిరామ్ ఉండడం గమనించారు. పోలీసులను చూసిన నిందితులు బాలుడిని అక్కడ వదిలి పరారయ్యారు. చిన్నారిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇవీ చదవండి: