చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కుమారనత్తం గ్రామంలో జగనన్న కాలనీ నిర్మాణానికి మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. తాడేపల్లి నుంచి సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. కుమారనత్తంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. మొత్తం 398 గృహాల నిర్మాణానికి.. ఇక్కడ ఏర్పాట్లు చేయగా.. సీఎం జగన్ నిర్దేశించిన సమయంలోపు నిర్మాణం పూర్తి కావాలని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... Jagananna house: రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్