చిత్తూరు జిల్లా పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయ పునః నిర్మాణ పనులను.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. తిరుమల శ్రీవారి తల్లిగా పూజలందుకునే వకుళామాత ఆలయాన్ని తన సొంత ఖర్చులతో తిరిగి నిర్మిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి.. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయానికి చేరుకునే మార్గాన్ని మొత్తం చదును చేసి.. ప్రగతి పనులను చేపట్టాలని సూచించారు. ఆలయానికి బంగారు తాపడం పనులను.. త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు వీలైనంత త్వరగా దర్శన భాగ్యం కల్పించాలన్నారు.
ఇదీ చదవండి:
Balakrishna: ఎమ్మెల్యే బాలకృష్ణ ఉదారత... బ్లాక్ ఫంగస్ రోగికి మందులు అందజేత