కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్ధ కార్యాలయంలో మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ప్రతి ఇంటికి మూడు మాస్కులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, కమిషనర్ గిరీషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలు తయారు చేసిన మాస్కులు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బందికి సరుకులను అందజేశారు.
ఇవీ చదవండి...