తమ సమస్యలు పరిష్కరించాలని తితిదే ఉద్యోగులు మంత్రి పెద్దిరెడ్డిని కలిసారు. తిరుపతిలోని మంత్రి స్వగృహంలో.. వారి సమస్యలను వివరించారు. తితిదే ఉద్యోగులకు కేటాయించిన పూర్ హోమ్, డైరీఫాం, బ్రాహ్మణపట్టు, వినాయక నగర్, ఎస్జీఎస్ బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసులను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
తితిదే ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, ఈహెచ్ఎస్ పరిధిలోకి చేర్చకుండా నగదురహిత వైద్యం అందించాలని అన్నారు. 1060 జీవో సవరించి పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తితిదేలో పనిచేస్తున్న 14వేల మంది కాంట్రాక్టు కార్మికులకు టైం స్కేల్ ఇవ్వాలని కోరారు. అనంతరం వినతి పత్రం అందించారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు