Minister peddi reddy on Chandrababu: రాబోయే శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందిస్తానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పల్లెబాటలో భాగంగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుప్పంలో గ్రానైట్ మాఫియా ఉందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అదంతా వాస్తవమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు.
ఇదీ చదవండి: ఆసక్తి రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు.. యూపీపైనే అందరి కళ్లు