చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్దికి అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి ఆదేశించారు. చిత్తూరులోని జడ్పీ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో పశుగ్రాసం కొరత రాకుండా రైతులకు రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి