బయటి ప్రాంతాల్లో దొరికిన తలనీలాలను తితిదేతో ముడిపెట్టి రాజకీయం చేయడం తగదని మంత్రి కొడాలి నాని అన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరులో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలనీలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి సీఎం, వైవీ సుబ్బారెడ్డికి లేదని ఆయన అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 20నెలల కాలంలోనే 90% హామీలను నెరవేర్చిందన్నారు. తమ అభ్యర్థిని అఖండ విజయంతో గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: ఉప ఎన్నికలో వాలంటీర్లకు చెక్ పెట్టేందుకు పార్టీల వ్యూహస్త్రాలు