ETV Bharat / state

ఇక తిరుమల తిరుపతిలో మల్టీ లెవల్ పార్కింగ్​! - undefined

కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమార్కుల నుంచి కాపాడటం... ఖాళీ భూములను ప్రజా అవసరాలకు వినియోగించడం వంటి బహుళ ప్రయోజనకరమైన విధానానికి తిరుపతి నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగరంలో ట్రాఫిక్​ రద్దీని నియంత్రించేందుకు హథీరాం మఠం భూములను లీజుకు తీసుకునేందుకు సిద్ధమైంది.

ఇక తిరుమల తిరుపతిలో మల్టీ లెవల్ పార్కింగ్​!
author img

By

Published : Jul 27, 2019, 6:12 PM IST

ఇక తిరుమల తిరుపతిలో మల్టీ లెవల్ పార్కింగ్​!

తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులతో పాటు.. నగర వాసులతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను తీర్చే పనిలో పడింది నగర పాలక సంస్థ. ఇందు కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హథీరాం మఠం భూములను లీజు ప్రాతిపదికన తీసుకొనేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ నిర్ణయంతో మల్టీ లెవల్ పార్కింగ్, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు చేసేందుకు సిద్ధమైంది.

తిరుపతి నగరంలో దాదాపు రెండు లక్షల ద్విచక్రవాహనాలు.... వేల సంఖ్యలో కార్లు ఉన్నాయి. వీటికి తోడు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులతో కార్లు, జీపులు, సుమోలు అధిక సంఖ్యలో తిరుపతికి వస్తాయి. నగరంలో సరైన పార్కింగ్ సదుపాయం లేని కారణంగా.. ఎక్కడపడితే అక్కడ ఆపేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాణిజ్య సముదాయాల ముందు వాహనాలను ఆపివేస్తున్న ఫలితంగా.. ఆయా దుకాణాలకు వెళ్లే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ వ్యాపారంపై ఇది ప్రభావం చూపిస్తోందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

నగరంలోని విష్ణు నివాసం, రైల్వే రిజర్వేషన్ కార్యాలయం వంటి కొన్ని ప్రదేశాల్లో పెయిడ్​ పార్కింగ్ సౌకర్యం ఉంది. గాంధీరోడ్డు, తిలక్​రోడ్డు, భవానీ నగర్ వంటి కొన్ని రద్దీ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్థానిక ప్రజలతో పాటు తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో హథీరాం మఠం భూములను లీజ్​ ప్రాతిపదికన తీసుకుంటే మంచిదని నగరపాలక సంస్థ భావించింది. అనుమతులు కోరుతూ నగర పాలక అధికారులు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపారు.

నగరపాలక సంస్థ ప్రతిపాదనలతో అటు విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడమే కాక... ప్రజా ప్రయోజనాలకు నెరవేర్చే అవకాశం ఉంటుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

Intro:..Body:తాడేపల్లిగూడెం బీజేపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం ఇసుక పాలసీని ప్రకటించి భవననిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అవినీతిని అరికడతామని చెపుతున్నా మట్టి మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయన్నారు. తాడేపల్లిగూడెం మండలం లోని కొమ్ముగూడెం కోరుమామిడి బ్రిడ్జికి ఇరువైపుల గట్లను తవ్వివేటం వలన బ్రిడ్జి కొట్టుకు పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. అక్రమ మట్టితవ్వకాలను తక్షణం నిపివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక, మట్టి మాఫియా దోపిడిని అరికట్టని పక్షంలో బి.జె.పి ప్రత్యక్ష పోరాటానికి సిద్దమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్రక్ ఆటోలకు ట్యాక్స్ రద్దు చెయ్యాలన్నారు. జై శ్రీరాం నినాదం అసహనం కలిగిస్తుందని 40మంది స్వయం ప్రకటిత మేధావులు కేంద్రానికి లేఖ పంపారన్నారు. అసలైన లౌకికభావన హిందూ సమాజంలోనే ఉందన్నారు. 130కోట్ల ప్రజల కంటే తాము అతీతులమనే భావన నుంచి స్వయం ప్రకటిత మేధావులు బయటకు వచ్చి ప్రజలతో మమైకం కావాలని హితవు పలికారు. గత ప్రభుత్వం లో జరిగిన అవినీతి పై సిటింగ్ హైకోర్ట్ జడ్జితో విచారణ చేయించాలని, అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిదుల నుంచి సొమ్ములు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయభూముల్లో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న 3,500 మందికి ముఖ్యమంత్రి చేతులమీదుగా పట్టాలు అందించాలన్నారు. గత ప్రభుత్వం తాడేపల్లిగూడానికి మంజూరు చేసిన బయో పవర్ ప్లాంట్ నిర్మించి పట్టణానికి డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలన్నారు. ఆటోనగర్ ఏర్పాటుకు సంబందించిన భూసమస్య పరిష్కరం అయిందని, అర్హులను గుర్తించి పట్టాలందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలో డిగ్రీ, జూనియర్ కళాశాలు, ,ఐ.టి.ఐ లను నిర్మించాలన్నారు. బి.జె.పి నాయకులు కర్రి ప్రభాకరబాలాజీ, కొండపల్లి నగేష్, ముప్పిడి సురేష్ రెడ్డి, సత్యనారాయణ, యడ్లపల్లి శ్రీరామ్, రామకృష్ణ, సిర్రాపు శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎం రాజశేఖర్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
9553161261Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.