తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే ఛైర్మన్ కార్యాలయంలో ఓ మీడియా సంస్థ నకిలీ గుర్తింపు కార్డుతో వీఐపీ బ్రేక్ దర్శనం పొందేందుకు యత్నించిన వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. దర్శనం కోసం లేఖ సమర్పించగా.. గుర్తింపు కార్డును చూసిన తితిదే సిబ్బంది అనుమానంతో పై అధికారులకు సమాచారమిచ్చారు. వారి విచారణలో అది నకిలీ గుర్తింపు కార్డుగా తేలటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసుల... అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు హైదరాబాద్ సరూర్ నగర్‌కు చెందిన వెంకట్రామణరావుగా గుర్తించారు. తనకు తరచూ స్వామివారిని దర్శించుకోవడం అలవాటని... దర్శన టిక్కెట్లు పొందడం కోసమే నకిలీ కార్డును తయారు చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'మతసామరస్యాన్ని నెలకొల్పడంలో గ్రామ సంరక్షణ దళాల పాత్ర కీలకం'