కరోనా, సాధారణ కాలాల్లో వేలాదిమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు నిలుపుతున్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి రాయలసీమకే తలమానికం అని తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర రెడ్డి అన్నారు. స్విమ్స్‌కు వైద్యపరికరాల వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆసుపత్రిలో అత్యంత ప్రతిభావంతులైన డాక్టర్లు, పరిపాలన వ్యవస్థతో మెరుగైన వైద్యసేవలు అందించడం శుభ పరిణామమని చెప్పారు. రూ. 5 లక్షల విలువైన 13 స్ట్రెచర్లు, 43 వేల గ్లౌజులను జయచంద్రారెడ్డి అనే దాత స్విమ్స్ ఆసుపత్రికి అందజేశారు.
ఇదీ చూడండి: