చిత్తూరు జిల్లా వేపలపల్లి గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. జొన్నచేనుపల్లి గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు.
మృతుడు కోసువారిపల్లె సోలార్ విద్యుత్ ప్లాంట్లులో సెక్యూరిటీగార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రామస్వామి భార్య 10 సంవత్సరాల క్రితం మృతి చెందింది. 5 సంవత్సరాల క్రితం కుమార్తె. అల్లుడు వేరు వేరు సంఘటనల్లో మృత్యవాత పడ్డారు. అప్పటి నుంచి అతను ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఒంటరితనం భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని సోదరుడు కృష్ణా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.